Raja Singh: టీటీడీలో హిందువులే పనిచేయాలనడం కరెక్టే.. అసదుద్దీన్‌కు రాజాసింగ్ కౌంటర్
టీటీడీలో, కాశీ బోర్డులో హిందూయేతరులకు స్థానం లేనప్పుడు వక్ఫ్ బోర్డు(Waqf Board)లో ఇతరుల ప్రమేయం ఎందుకని ఎంఐఎం అధినేత అసదుద్దీన్(Asaduddin) ప్రశ్నించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: టీటీడీలో, కాశీ బోర్డులో హిందూయేతరులకు స్థానం లేనప్పుడు వక్ఫ్ బోర్డు(Waqf Board)లో ఇతరుల ప్రమేయం ఎందుకని ఎంఐఎం అధినేత అసదుద్దీన్(Asaduddin) ప్రశ్నించిన విషయం తెలిసిందే. టీటీడీలో అన్యమస్తులు ఉండొద్దని చెప్తున్నారు. అలాంటప్పుడు వక్ష్ బోర్డు(Waqf Board)లో నాన్ ముస్లిమ్‌లను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ముస్లిమేతరులను చేర్చాలనే ఉద్దేశంతోనే మోడీ సర్కార్ వక్ఫ్ బోర్డు(Waqf Board) సవరణలు తెచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin) విమర్శించారు.
తాజాగా.. సదుద్దీన్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) కౌంటర్ ఇచ్చారు. వార్తల్లో కనిపించేందుకే అసదుద్దీన్ మాట్లాడతారు. టీటీడీ(TTD)లో హిందువులే పనిచేయాలనడం కరెక్టే అని రాజాసింగ్(Raja Singh) అన్నారు. టీటీడీ చైర్మన్ మంచి నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్‌బోర్డ్‌తో TTDని పోల్చడం సరికాదు. 1947లో వక్ఫ్‌బోర్డ్ భూములు ఎన్ని ఉన్నాయి?, హిందూ రైతుల నుంచి భూములు కబ్జా చేశారని ఆరోపించారు. వక్ఫ్ భూములపై మంచి చట్టం రాబోతోందని రాజాసింగ్(Raja Singh) అన్నారు.