తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్..నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2024-07-14 08:36 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాల విస్తరణకు తోడు ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాలోని ప్రజలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేడు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లోనూ ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.


Similar News