Rain Alert: రెమాల్ తుఫాన్ ప్రభావం.. రాష్ట్రంలోని ఆ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

రెమాల్‌ తుఫాన్‌ కాణంగా ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-05-28 02:14 GMT
Rain Alert: రెమాల్ తుఫాన్ ప్రభావం.. రాష్ట్రంలోని ఆ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రెమాల్‌ తుఫాన్‌ కాణంగా ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షంతో బెంగాల్‌‌లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అయితే, తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా పడనుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. పలుచోట్ల భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం.. మంగళవారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నిర్మల్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.  

Tags:    

Similar News