MP Laxman: రాహుల్ గాంధీ నేలకు ముక్కురాసి క్షమాపణలు చెప్పాలి: ఎంపీ లక్ష్మణ్

రైతులను కాంగ్రెస్ నిండా ముంచిందని బీజేపీ ఎంపీ ధ్వజమెత్తారు.

Update: 2025-01-05 05:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ (Congress) అంటేనే దగా, మోసం అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.కె. లక్ష్మణ్  (Dr. K. Laxman) విమర్శించారు. రైతులను కాంగ్రెస్ నిండా ముంచిందని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు రైతుభరోసా (Rythu Bharosa) కింద రూ. 15 వేలు ఇస్తామని ఇప్పుడు రూ.12 వేలు అంటున్నారని మండిపడ్డారు. వారంటీ లేని గ్యారంటీలు ఇచ్చిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఓ మీడియాతో మాట్లాడిన ఆయన.. మోసపూరిత హామీ ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) అశోక్ నగర్ వచ్చి ముక్కు నేలకు రాయాలన్నారు. కాగా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకూ రైతు భరోసా కిందా ఏటా రూ. 12 వేల పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర కేబినెట్ శనివారం ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 26 నుంచి ఈ స్కీమ్ ను అణలు చేయాలని నిర్ణయించింది.

Tags:    

Similar News