మరోసారి తెలంగాణకు రాహుల్, ఖర్గే.. అగ్రనేతల షెడ్యూల్ ఫిక్స్
ఈ నెల 17న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు తెలంగాణకు మరోసారి రానున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ పర్యటనపై ఏఐసీసీ రాష్ట్ర
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 17న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు తెలంగాణకు మరోసారి రానున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ పర్యటనపై ఏఐసీసీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందించింది. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న రాహుల్.. అక్కడ్నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అక్కడ్నుంచి నర్సంపేటకు చేరుకోనున్న రాహుల్ గాంధీ.. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ ఈస్ట్‌కు వెళ్లనున్నారు.
వరంగల్ ఈస్ట్‌లో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర చేసిన తర్వాత వరంగల్ వెస్ట్‌కు నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. అక్కడ్నుంచి సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు రాహుల్ రానున్నారు. రాత్రి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే మల్లికార్జున ఖర్గే షెడ్యూల్ ఇప్పటి వరకు రాలేదు. రాహుల్, ఖర్గేలు కలసి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, తుది దశ ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేసింది. ఢిల్లీ నేతలను వరుసగా ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత ప్రియాంక గాంధీ వచ్చే ఛాన్స్ ఉన్నదని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనేందుకు టీపీసీసీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది.
Read More..
ప్రధాని మోడీ, కేసీఆర్, అసదుద్దీన్.. ముగ్గురు పెద్ద దొంగలు: ఫిరోజ్ ఖాన్