మెదక్ బీఆర్ఎస్ MP అభ్యర్థిపై డీజీపీకి రఘునందన్ రావు కంప్లైంట్
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పి. వెంకట్ రాంరెడ్డిపై కేసు రిజిస్టర్ చేయాలని బిజెపి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శని వారం హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసారు.
దిశ, క్రైమ్ బ్యూరో : మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పి. వెంకట్ రాంరెడ్డిపై కేసు రిజిస్టర్ చేయాలని బిజెపి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శని వారం హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నెంబర్ 243/2024 కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారి రాధాకిషన్ రావు మార్చ్ 9న ఇచ్చిన వాంగ్మూలంలోని పేజీ నెంబర్ 5, 6, 7లో అతను తాను బీఆర్ఎస్ నేత, రిటైర్డ్ ఐఏఎస్ వెంకట్ రాం రెడ్డికి సన్నిహితుడని తెలిపారు.
వెంకట్ రాం రెడ్డి, రాజ పుష్పా కన్స్‌స్ట్రక్షన్స్ యజమానులైనా అయన సోదరులు వ్యాపారుల నుంచి వసూలు చేసిన డబ్బులను ఎస్ఐ ద్వారా ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్లు అందులో తెలిపారు. రాధాకిషన్ రావు చెప్పిన ప్రకారమే తాను ఆ డబ్బును తరలించినట్లు ఎస్ఐ సాయి కిరణ్ 161(3) కింద స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని రఘునందన్ రావు తన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నారు. రాధాకిషన్ రావు 9 మార్చి నాడు ఇచ్చిన వాంగ్మూలంలో వెంకట్ రాం రెడ్డి, రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ యజమానులు బీఆర్ఎస్‌కు ఫండ్స్ ఇస్తుందని వివరించినట్లు రఘునందన్ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలా వెంకట్ రాం రెడ్డి అనేక చట్ట వ్యతిరేక వ్యవహారాలు చేసాడని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా తనను ఏ చట్టం ఏమి చేయదనే తీరుతో నాన్ బెయిలేబుల్ కేసులలో తప్పించుకున్నాడని రఘునందన్‌రావు డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేసారు. అతని జోలికి ఎవరు వెళ్ళలేరనే తీరు తో ప్రవర్తిస్తున్నాడని రఘునందన్‌రావు ఆరోపించారు. గతంలో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రఘు నందన్ రావు విమర్శించారు. ఇప్పుడైనా వెంకట్ రాం రెడ్డితో పాటు, అక్రమంగా సంపాదించిన అతని కుటుంబ సభ్యులు, రాజ పుష్పా కన్స్‌స్ట్ర క్షన్స్ పెట్టుబడులు, ఇతర వ్యవహారాలపై ప్రత్యేక ఐపిఎస్ అధికారిని నియమించి విచారణ జరిపి, వెంకట్ రాం రెడ్డి, రాజ పుష్పా కన్స్‌స్ట్రక్షన్స్‌పై చర్యలు తీసుకోవాలని బిజెపి మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫిర్యాదులో కోరారు. రాధా కిషన్ రావు, ఎస్ఐ సాయి కిరణ్ వాంగ్మూలం, స్టేట్మెంట్ లను ఫిర్యాదుకు జత చేసారు.
Read More..
Riots: ఆంధ్రాలో కొనసాగుతున్న 144 సెక్షన్.. అల్లర్లకు కారకులు ఎవరు..?