ఉప్పల్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం: రాచకొండ సీపీ సుధీర్ బాబు

మరికొద్ది సేపట్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.

Update: 2024-10-12 12:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: మరికొద్ది సేపట్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేయసాగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా.. మ్యాచ్‌కు అవాంతరం కలిగకుండా చూసేందకు పోలీసులు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పలువురిని ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. స్టేడియం వద్ద భారీగా మొహరించారు.

ఈ క్రమంలోనే మ్యాచ్‌ రక్షణ ఏర్పాట్లకు సంబంధించి రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. మ్యాచ్‌కు అన్ని రకాల ఏర్పాట్లూ చేశామని, 2500 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాకుండా 400 సీసీ కెమెరాలతో అనుక్షణం స్టేడియం మొత్తాన్ని పర్యవేక్షించనున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.


Similar News