Pushpa-2: అల్లు అర్జున్ బెయిల్ పై న్యాయవాది అశోక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theatre Stampade) ఘటనలో అల్లు అర్జున్(Allu Arjun) కు నాంపల్లి కోర్టు రెగ్యూలర్ బెయిల్(Regular Bail) మంజూరు చేసింది.

Update: 2025-01-03 12:51 GMT

దిశ, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theatre Stampade) ఘటనలో అల్లు అర్జున్(Allu Arjun) కు నాంపల్లి కోర్టు రెగ్యూలర్ బెయిల్(Regular Bail) మంజూరు చేసింది. దీనిపై న్యాయవాది అశోక్ రెడ్డి(Advocate Ashok Reddy) మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. అల్లు అర్జున్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని, రూ.50 వేల పూచికత్తుతో ఇద్దరు సాక్షి సంతాలతో కూడిన బాండ్ ను కోర్టుకు సమర్పించాలని చెప్పినట్లు తెలిపారు. అంతేగాక ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని, కేసు ముగిసే వరకు విచారణకు పూర్తిగా సహకరించాల్సి ఉంటుందని కోర్టు సాధారణ షరతులు విధించినట్లు తెలిపారు. ఇక ఈ కేసులో చనిపోయిన రేవతిది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదని కోర్టు నిర్ధారించిందని, అందకే బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉందని, దీనిపై ఈ నెల 21న విచారణ జరుగుందని అన్నారు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని న్యాయవాది ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News