ఆదానీ కుంభకోణంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. రాజ్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్
దిశ, తెలంగాణ బ్యూరో: ఆదానీ కుంభకోణంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్‌పార్టీ ప్రణాళికను సిద్ధం చేసింది.ఈ నెల 15న రాజ్‌భవన్‌ను ముట్టడించాలని ప్లాన్చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మివేతపై నిలదీయనున్నారు. ఈ మేరకు కార్యకర్తలంతా తరలిరావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పిలుపు ఇచ్చారు. ఆదానీ షేర్ల కుంభకోణం, ఎల్ఐసీ,ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల బాట పట్టడం వంటి వాటిపై ప్రజలకు వివరించేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కార్యాలయాలు కూడా ముట్టడించేందుకు కాంగ్రెస్ప్రణాళికలు సిద్ధం చేసింది.