మేము పిచ్చోళ్ల లెక్క కనిపిస్తున్నామా? కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నిరసన

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు నిరసన చేపట్టారు.

Update: 2024-04-12 07:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు నిరసన చేపట్టారు. డబుల్ బెడ్ రూమ్‌లకు తమను ఎంపిక చేసిన ఇప్పటి వరకు ఇండ్లు ఇవ్వకపోవడంతో కొంత మంది లబ్ధిదారులు ఉదయం కేసీఆర్ ఫామ్ హౌస్ గేటు ముందు నిరసన తెలిపారు. మేము ఏం పాపం చేసినం.. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్‌ను మూడు సార్లు గెలిపించామని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎంగా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేశారని కేసీఆర్‌ను నిలదీశారు. అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారని, కానీ మమ్మల్ని మాత్రం రోడ్డు మీద నిలబెట్టారని కేసీఆర్ పై మండిపడ్డారు. ‘మేము పిచ్చోళ్ల లెక్క కనిపిస్తున్నమా? కలెక్టరేట్ కు పోయినం.. సిద్దిపేట వచ్చినం.. ఇళ్లు ఇచ్చుడు చేతకానప్పుడు.. డ్రా ఎందుకు తీసినవ్? అని కేసీఆర్‌ను నిలదీశారు. దీంతో ఫామ్ హౌస్ దగ్గర ఉన్న పోలీసులు నిరసన కారులను అడ్డుకున్నారు. కేసీఆర్‌ను కలిసే వరకు ఇక్కడి నుంచి వెళ్లమంటూ లబ్ధిదారులు తేల్చి చెప్పారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..