Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిర్మాత తమ్మారెడ్డి స్పందన

నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చుతామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

Update: 2024-07-30 11:16 GMT
Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిర్మాత తమ్మారెడ్డి స్పందన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చుతామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించామని.. రెండు మూడు సార్లు అపాయింట్‌మెంట్ కోసం కాల్ చేశామని అన్నారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇస్తే వెళ్లి మాట్లాడటానికి రెడీగా ఉన్నామని అన్నారు. గద్దర్ గొప్ప వ్యక్తి.. ఆయన పేరుమీద అవార్డులు తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు అని ప్రకటించారు.

కాగా, అంతకుముందు గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందన లేకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. సినారె జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమపై తొలిసారి అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ ఏడాది జనవరిలో నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మారుస్తామని ప్రకటించారు. గద్దర్‌ అవార్డుల కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాలు, సూచనలు అందించాలని మరోసారి పరిశ్రమ పెద్దలకు సూచనలు చేశారు. తాజాగా సీఎం వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందించి.. అపాయింట్‌మెంట్ కోసం అనేకసార్లు ప్రయత్నించామని చెప్పారు.

Tags:    

Similar News