Dil Raju: సీఎం రేవంత్‌ను కలిసిన దిల్ రాజు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) కలిశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) కలిశారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మద్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(Telangana Film Development Corporation) చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు దిల్ రాజు కృతజ్ఞతలు చెప్పారు. ఇదిలా ఉండగా.. దిల్ రాజును తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Shanti Kumari) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు. కాగా, గత ఎన్నికల్లో దిల్ రాజు కాంగ్రెస్ తరపున ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వచ్చిన విషయమూ తెలిసిందే.