Draupadi Murmu : కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu)హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం(Koti Deepotsav)కార్యక్రమానికి విశిష్ట అతిధిగా హాజరయ్యారు.
దిశ, వెబ్ డెస్క్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu)హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం(Koti Deepotsav)కార్యక్రమానికి విశిష్ట అతిధిగా హాజరయ్యారు. నిర్వాహకులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. కోటి దీపోత్సవంలో దీప ప్రజ్వలన చేసిన రాష్ట్రపతి ముర్ము తొలి కార్తీక దీపాన్ని వెలిగించారు. పూరీ జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్కలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులనుద్ధేశించి రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు.
దీపాలతో ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించడం మన సంప్రదాయం.. కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్తీక మాసంలో అందరూ శివున్ని కొలుస్తారని.. అసత్యంపై సత్యం గెలిచిన పండగ ఇది.. తెలుగు నేలపై కార్తీక మాసం వేళ కోటి దీపోత్సవం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందరూ ఒక్కటై దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందని కోటి దీపోత్సవం నిర్వాహకులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు.