సుదర్శన్ థియేటర్ ముందు నిద్రపోయిన ఫ్యాన్ (వీడియో)
పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా, దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా, దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. అయితే నిరీక్షణకు తెరదించుతూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ మూవీ ట్రెండింగ్ లో ఉంది. సినిమా థియేటర్లన్నీ ‘ఆదిపురుష్’ షోలతో కిక్కిరిసిపోయాయి. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ పడుకున్నారు. షో కోసం వచ్చి పడుకున్న అభిమాని నేరుగా మంచం, బెడ్ షీట్, దుప్పట్లు తెచ్చుకుని థియేటర్ ఎదుట పడుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఇదేందిది.. నేను ఎప్పుడు చూడలా..! అని షాక్ అవుతున్నారు.
Read More: ‘ఓం రౌత్ నిన్ను చంపేస్తా’.. ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌పై ఫ్యాన్స్ ఫైర్ (వీడియో)
నా అందాన్ని ప్రజలు అంగీకరించలేదు.. చాలాకాలం అభద్రతకు లోనయ్యాను