Ponnam Prabhakar:‘ఆటోల బంద్ వాయిదా వేయండి’.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

ఆటో కార్మికులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి(Transport and BC Welfare Minister) పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) హామీ ఇచ్చారు.

Update: 2024-12-03 10:45 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆటో కార్మికులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి(Transport and BC Welfare Minister) పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) హామీ ఇచ్చారు. నేడు(మంగళవారం) హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను తెలంగాణ ఆటో &ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి నేతలు కలిశారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆటో డ్రైవర్లు ఇచ్చిన సమ్మె పిలుపుపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తమ ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. సమస్యలు పరిష్కారించాలని ఆటో యూనియన్ నేతలు వినతిపత్రం అందజేయగా ఆయన మాట్లాడారు. ఈ నెల 6న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం, రవాణా శాఖ సిబ్బందితో ఈ విషయమై చర్చిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో బంద్‌ను వాయిదా వేయాలని మంత్రి పొన్నం కోరారు.

Tags:    

Similar News