కోమటిరెడ్డి రాజీనామాతో 'మునుగోడు'కు జరిగిన మేలు ఇదే!

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పలు మండలాల్లో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. చండూరు, సంస్థాన్ నారాయణపురంలో ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Update: 2022-10-17 03:11 GMT
కోమటిరెడ్డి రాజీనామాతో మునుగోడుకు జరిగిన మేలు ఇదే!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పలు మండలాల్లో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. చండూరు, సంస్థాన్ నారాయణపురంలో ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన విషయం తెలిసిందే. తాజాగా.. సంస్థాన్‌ నారాయణపురంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా పోస్టర్లు వెలిశాయి. 'ఫలిస్తున్న రాజన్న రాజీనామా' పేరుతో పోస్టర్లు వెలిశాయి. 'నీ ధిక్కారంతోనే సహకారమవుతున్న మునుగోడు ప్రజల కల' అంటూ మరో పోస్టర్‌లో పేర్కొన్నారు. ''కోమటిరెడ్డి రాజీనామాతోనే ప్రతీ గ్రామానికి రూ.20 లక్షల నిధులు వచ్చాయి. చౌటుప్పల్‌లో 5 డయాలసిస్ యూనిట్ల మంజూరు. హుటాహుటిన చేనేత బీమా ప్రకటించారు.'' అంటూ పోస్టర్లలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాశారు.

Tags:    

Similar News