Ponguleti Srinivas Reddy : తెలంగాణ రెండో రాజధాని గురించి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) నేడు వరంగల్(Warangal) లో పర్యటించారు.
దిశ, వెబ్ డెస్క్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) నేడు వరంగల్(Warangal) లో పర్యటించారు. నగరంలోని భద్రకాళి అమ్మవారి(Bhadrakali)ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి వరంగల్ నగరం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ నగరాన్ని తెలంగాణకు రెండో రాజధానిగా అభివృధ్ది చేస్తామని పేర్కొన్నారు. మామునూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని, త్వరలోనే అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రకాళి జలాశయాన్ని తాగునీటి జలాయశయంగా మారుస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్దికి మరిన్ని నిధులు విడదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.