అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన పోలీసులు.. కేసులు నమోదు..?
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హీరో ని అరెస్ట్ చేయడంతో.. పోలీసులు, తెలంగాణ సీఎంకు వ్యతిరేకంగా బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
కాగా ఇలాంటి పోస్టులపై నిఘా పెట్టిన తెలంగాణ పోలీసులు.. తాజాగా కాంగ్రెస్ సహా.. ఇతరులు చేసిన ఫిర్యాదులపై స్పందిస్తూ.. పలువురు అభిమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా కీలకంగా వ్యవహరించిన పలువురు బన్నీ అభిమానులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ అభిమానుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో తాము ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులను ఆగమేఘాల మీద డిలీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఘటనకు కారణమైన సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసుల విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.