జానీ మాస్టర్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నాం..అరెస్ట్‌పై పోలీసుల ప్రకటన

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్‌(Johnny Master)పై సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) గురువారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Update: 2024-09-19 12:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master) అరెస్ట్‌పై సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) గురువారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్‌ చేశాం. గోవా కోర్టులో హాజరుపర్చి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలిస్తున్నాం. రేపు ఉప్పర్‌పల్లి కోర్టు(Upparpally Court)లో జానీ మాస్టర్‌ను హాజరుపర్చుతాం. 2020లో జానీ లైంగికదాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. తాను మైనర్‌గా ఉన్నప్పుడే దాడి చేశాడని స్పష్టం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై పోక్సోతో పాటు రేప్‌ కేసులు నమోదు చేశాం’ అని ప్రకటనలో పోలీసులు పేర్కొన్నారు. కాగా, జానీ మాస్టర్ వ్యవహారం రెండు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసుపై ఇండస్ట్రీకి చెందిన పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలోనూ హేమ కమిటీ వంటి కమిషన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ప్రత్యేక బృందాలుగా విడిపోయి జానీ మాస్టర్ కోసం గాలించిన విషయం తెలిసిందే. చివరకు గోవాలో ఉన్నాడనే పక్కా సమాచారంతో వెళ్లి అరెస్ట్ చేశారు.

Read More..

జానీ మాస్టర్ అత్యాచారం కేసులో నాగబాబు షాకింగ్ ట్వీట్ 


Similar News