Auto Drivers Protest : ఆటో డ్రైవర్ల మహాధర్నా నిరసనకు పోలీసుల అనుమతి

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ఈ నెల 5న ఆటో డ్రైవర్లు మహాధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-11-04 13:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ఈ నెల 5న ఆటో డ్రైవర్లు మహాధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ Auto Drivers Protest మహాధర్నాకు పోలీసులు అనుమతి లభించింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సెంట్రల్ జోన్ కమిషనర్ అనుమతి Protest Permission ఇచ్చారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్‌లో రేపు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు కార్యక్రమం చేసుకోవచ్చని, అందులో 200 మంది కంటే ఎక్కువగా మెంబర్స్ పాల్గొనవద్దని ఆర్డర్స్ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఏమైనా డిస్టర్బ్ జరిగితే పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామని నోటీసుల్లో కండిషన్ పెట్టారు.

కాగా, మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకొని రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు మహాధర్నాకు పిలుపునిచ్చారు. అలాగే మహాలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోయినందుకు నెలకు 15 వేల రూపాయలు ఇవ్వాలని, నగరంలో కొత్తగా 20,000 ఆటోలకు పర్మిట్లు ఇచ్చి, మీటర్ చార్జీలు కూడా పెంచాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాకు BRS బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతునిచ్చింది.

Tags:    

Similar News