Lookout Notice: లగచర్ల ఘటన.. సురేష్ పై లుకౌట్ నోటీసులు

లగచర్లలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన ఫార్మావిలేజ్ (Pharma Village)ను రైతులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్కడికెళ్లిన కలెక్టర్ పై రైతులు దాడి చేయడంతో.. ఆ ఘటనపై కేసు నమోదైంది. ఇందులో ఏ1గా నరేందర్ రెడ్డిని, ఏ2గా సురేశ్ ను చేర్చారు.

Update: 2024-11-18 06:23 GMT

దిశ, వెబ్ డెస్క్: లగచర్లలో (Lagcharla) ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన ఫార్మావిలేజ్ (Pharma Village)ను రైతులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్కడికెళ్లిన కలెక్టర్ పై రైతులు దాడి చేయడంతో.. ఆ ఘటనపై కేసు నమోదైంది. ఇందులో ఏ1గా నరేందర్ రెడ్డిని, ఏ2గా సురేశ్ ను చేర్చారు. 25 మందిని అరెస్ట్ చేశారు. అయితే.. ఏ2 నిందితుడైన సురేశ్ పరారీలో ఉండటంతో.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా సురేశ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

మరోవైపు.. ఢిల్లీలో లగచర్ల రైతులు పలువురిని కలిసి తమ ఫిర్యాదులను అందజేయనున్నారు. జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, షెడ్యూల్ ట్రైబ్ కమిషన్, షెడ్యూల్ కులాల కమిషన్ల అధికారులకు లగచర్ల ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. 

Tags:    

Similar News