Sangareddy : సంగారెడ్డిలో మరోసారి భారీగా బంగారం పట్టివేత..
ఇటీవల రూ. 3.10 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల రూ. 3.10 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సంగారెడ్డిలో మరోసారి భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని మునిపల్లి మండలం కంకోల్ జాతీయ రహదారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంగారాన్ని స్వాధినం చేసుకున్నారు.
ముంబై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో బంగారు అభరణాలు లభ్యం అయ్యాయి. ఎటువంటి పత్రాలు లేకుండా చంద్రేష్ అనే వ్యక్తి నుంచి నాలుగు కిలోల ఎనిమిది వందల గ్రాముల బంగారాన్ని తరలిస్తున్నాడు. ఈ సందర్భంగా బంగారాన్ని, దాన్ని తరలిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి పీఎస్‌కి టాస్క్‌ఫోర్స్ పోలీసులు తరలించి విచారణ చేపట్టారు.