ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దూకుడు.. BRS ఎమ్మెల్సీ ఇంట్లో సోదాలు..?

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో పోలీసులు

Update: 2024-04-08 05:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో పోలీసులు సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు ఆ గెస్ట్ హౌస్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో ఉన్న ఈ గెస్ట్ హౌస్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ గెస్ట్ హౌజ్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీదని సమాచారం. గులాబీ పెద్దలకు అత్యంత దగ్గర వ్యక్తి అయిన ఆ ఎమ్మెల్సీ పేరు ఫోన్ ట్యాపింగ్ కేసులో సైతం తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అతడికి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  



Tags:    

Similar News