Y. S. Sharmila పై కవిత వ్యంగ్యాస్త్రాలు..
వైఎస్‌ఆర్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై ఎమ్మెల్సీ కవిత వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్సార్టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల, టీబీజేపీ పార్టీపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు. సోమవారం షర్మిల ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన ఘటనను ఉద్దేశిస్తూ కవిత ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది. ' తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు' అంటూ ట్విట్టర్ వేదికగా షర్మిల, బీజేపీ పార్టీపై కవిత విమర్శలు గుప్పించారు. అయితే, షర్మిలను ఒక మహిళ అని చూడకుండా కారులో ఉండగానే క్రేన్ సహాయంతో పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లడంపై గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఒక మహిళ పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అసహ్యకరమని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. కాగా, కవిత చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 'తెలంగాణా ప్రజలు తిరస్కరించిన ఒక మహిళా నాయకురాలివి అయి ఉండి...సాటి మహిళపై ఇలా స్పందిచడం సిగ్గు చేటు అని విమర్శిస్తున్నారు. మహిళల గౌరవం గురించి మాట్లాడితివి కదా అక్క మరి..నిన్న షర్మిల పట్ల మీ కార్యకర్తలు, పోలీసులు ప్రవర్తించిన తీరు ఎంటీ అని ప్రశ్నిస్తున్నారు. ఆమె కారులో ఉండగనే అల చేస్తారా అని నిలదీశారు. మహిళను ఇట్లానేనా గౌరవించేదని నెటిజన్లు మండిపడుతున్నారు. మీ ప్రభుత్వంలో ఒక మహిళా నాయకురాలిపై దాడి జరిగితే ఇట్లా స్పందిస్తవా..ఆరోపణ చేసినప్పుడు దానికి సమాధానం ఇవ్వాలి కానీ ఇలా కార్యకర్తల్ని రెచ్చగొట్టి దాడి చేయడం అన్యాయం కదా కవిత అక్కా. నీపై దాడి జరిగితే ఒకలా వెరొక మహిళపై దాడి జరిగితే ఇలా స్పందిచడం ఏంటని కామెంట్స్ చేస్తు్న్నారు. ప్రస్తుతం కవిత ట్వీట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
Read More......
Y. S. Sharmila అరెస్ట్ పై స్పందించిన గవర్నర్.. పోలీసుల వ్యవహార శైలిపై ఫైర్