uttam kumar reddy: ఏ సమస్య వచ్చినా పూర్తి బాధ్యత ఆ జిల్లా అధికారులదే: ఉత్తమ్

వరదల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.

Update: 2024-09-05 09:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అన్ని జిల్లాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండి నీటి స్టోరేజీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ జలసౌధలో ప్రాజెక్టులు, జలాశయాల్లో ప్రస్తుత పరిస్థితిపై ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల జరిగిన నష్టం, మరమ్మతులపై ఆరా తీశారు. ఏ సమస్య వచ్చినా పూర్తి బాధ్యత ఆ జిల్లా అధికారులదేనని, వరదలతో ఎంత నష్టం వాటిల్లిందో పూర్తి వివరాలు ఇవాళే ఇవ్వాలని ఆదేశించారు. డ్యామేజీల మరమ్మతుల కోసం షార్ట్ టైమ్ టెండర్లు పిలవాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో సామర్థ్యం మేరకు స్టోరేజీ ఉంచుకోవాలన్నారు.


Similar News