కర్నాటక నేతలను వదలని BRS.. ఆ పార్టీ టాప్ లీడర్ల ఫోన్ ట్యాపింగ్..?
కర్ణాటక ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన కొందరు కీలక కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ టార్గెట్చేసిందా?
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కర్ణాటక ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన కొందరు కీలక కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ టార్గెట్చేసిందా?.. కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే దాని ప్రభావం తెలంగాణపై పడుతుందని భావించి ఈ వ్యవహారాన్ని నడిపించిందా?.. ఫోన్ట్యాపింగ్కేసులో తాజాగా వ్యక్తమవుతున్న అనుమానాలివి. దీనిపై ఓ సీనియర్పోలీసు అధికారితో మాట్లాడగా.. ఈ అనుమానాలను కొట్టి పారేయలేమని వ్యాఖ్యానించటం గమనార్హం. తెలంగాణ ఎన్నికలు జరగటానికి 6 నెలల ముందు కర్ణాటక అసెంబ్లీకి ఎలక్షన్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలవకుండా చూస్తే తెలంగాణలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని బీఆర్ఎస్అప్పట్లో భావించింది.
అదే కాంగ్రెస్గెలిస్తే దాని ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికలపై ఉంటుందని అంచనా కూడా వేసింది. ఈ క్రమంలోనే ప్రణీత్‌రావు అతని టీంకు కర్ణాటక కాంగ్రెస్‌నాయకుల ఫోన్లను కూడా ట్యాప్చేసే పనిని కూడా అప్పగించినట్టుగా తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఓ సీనియర్పోలీసు అధికారితో మాట్లాడగా.. జరిపించి ఉండవచ్చని వ్యాఖ్యానించటం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పట్ల సానుకూల వైఖరితో ఉన్న పలువురు కాంట్రాక్టర్లు, వ్యాపార వేత్తలు, వ్యాపారుల నుంచి పెద్ద మొత్తాల్లో నగదును సీజ్చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వీటన్నింటినీ విశ్లేషిస్తే కర్ణాటకలో కూడా ప్రణీత్‌రావు అతని టీం సభ్యులు ఫోన్ట్యాపింగులు జరిపి ఉండవచ్చన్న అనుమానాలకు బలం చేకూరుతోందని వ్యాఖ్యానించారు.