పెట్రోల్, డీజిల్ దూకుడు.. మళ్లీ పెరిగిన ధరలు

దిశ, తెలంగాణ బ్యూరో: చమురు ధరలు పెరుగుతున్నాయని కారణంతో డీజిల్ పెట్రోల్ ధరలు గత వారం రోజులుగా జరుగు

Update: 2022-03-30 05:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చమురు ధరలు పెరుగుతున్నాయని కారణంతో డీజిల్ పెట్రోల్ ధరలు గత వారం రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. సామాన్యుడిపై ధరల పెరుగుదల గుదిబండ గా మారనున్నాయి. పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా నింగిని అంటనున్నాయి. ఈ నెల 22 నుంచి ప్రతిరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజు అటూఇటుగా పెట్రో, డీజిల్‌పై 90 పైసల చొప్పున వడ్డిస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. గత తొమ్మిది రోజుల్లో లీటరుపై మొత్తంగా రూ.5.60 భారం మోపాయి.

పెట్రో బాదుడులో ఎనిమిదో రోజైన నేడు లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.114.51కి చేరగా, డీజిల్‌ ధర రూ.100 దాటింది. ప్రస్తుతం డీజిల్‌ రూ.100.70కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.115.88 (84 పైసలు), డీజిల్‌ రూ.100.10 (85 పైసలు), చెన్నైలో పెట్రోల్‌ రూ.106.69 (75 పైసలు), డీజిల్‌ రూ.96.76 (76 పైసలు), కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.110.52 (84 పైసలు), డీజిల్‌ రూ.95.42 (80 పైసలు),న్యూఢిల్లీలో 80 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్‌ రూ.101.01కి చేరగా, డీజిల్‌ రూ.92.27 చేరింది. ఇప్పటికే ఓవైపు కరోనాతో ఆర్థికంగా చిన్నాభిన్నమైన పేద మధ్యతరగతి కుటుంబాలపై ఈ ధరలు మరింతగా ప్రభావం చూపనున్నాయి.

Tags:    

Similar News