సొంతగూటికి వచ్చేయండి.. ఉద్యోగులకు తెలంగాణ హౌసింగ్ శాఖ ఆదేశాలు

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలు, కార్పొరేషన్లలో డిప్యూటేషన్ విధానంపై పని చేస్తున్న తెలంగాణ హౌసింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన పర్మినెంట్ ఉద్యోగులు సొంత గూటికి వచ్చేయాలని ఆదేశాలు అందాయి....

Update: 2024-09-26 16:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలు, కార్పొరేషన్లలో డిప్యూటేషన్ విధానంపై పని చేస్తున్న తెలంగాణ హౌసింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన పర్మినెంట్ ఉద్యోగులు సొంత గూటికి వచ్చేయాలని ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర శాఖల్లో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న హౌసింగ్ కార్పొరేషన్ అధికారులను సొంత డిపార్ట్మెంట్‌కు రిలీవ్ చేయాలని ఆదేశించారు. మొత్తం 242 మంది ఉద్యోగులు, అధికారులను రిలీవ్ చేయాలని అన్ని శాఖలకు లేఖ రాశారు.

అయితే ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉండటంతో సిబ్బంది కొరత దృష్ట్యా వారందరినీ ఉపయోగించనున్నారు. ఈ మేరకు హౌసింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 78 మంది అధికారులు పని చేస్తుండగా ప్రభుత్వ సంబంధిత పలు కార్పొరేషన్లలో 164 మంది సేవలు అందిస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. అయితే అత్యధికంగా జీహెచ్ ఎంసీలో 67 మంది పని చేస్తున్నారు.


Similar News