పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి పొన్నంకు ముస్లిం జేఏసీ వినతి

గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చి అమలు చేయకుండా పెండింగ్ లో పెట్టిన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పరిష్కరించాలని కరీంనగర్ ముస్లిం జేఏసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరింది.

Update: 2024-09-26 17:28 GMT

దిశ; తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చి అమలు చేయకుండా పెండింగ్ లో పెట్టిన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పరిష్కరించాలని కరీంనగర్ ముస్లిం జేఏసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరింది. ఈ మేరకు గురువారం కరీంనగర్ ముస్లిం జేఏసీ అధ్యక్షుడు అబూబకర్ ఖాలీద్ ఆధ్వర్యంలో మంత్రిని పలువురు ముస్లిం జేఏసీ నాయకులు సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ శివారులోని చింతకుంట వద్ద అసంపూర్తిగా ఉన్న మైనారిటీ కమ్యూనిటి హాల్ నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలన్నారు. కరీంనగర్ లో మైనార్టీ స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేయాలని, వక్ఫ్ బోర్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, మదీనా కాంప్లెక్స్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి కాంప్లెక్స్ ను ఆధునికరించాలన్నారు. ఉర్దూ మీడియం స్కూళ్లలో విద్యా వాలంటీర్లను నియమించాలన్నారు.

ప్రస్తుత డీఎస్సీలో ఉర్దూ మీడియంలో ప్రభుత్వం కేటాయించిన ఎస్సీ ఎస్టీ పోస్టులను డి రిసర్వ్ చేసి అర్హులైన అభ్యర్థులందరికీ ఉద్యోగాలు కల్పించాలన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ మూడు విభాగాలను కలిపి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, చేయాల్సిన పనులు, పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ముఫ్తీ ఘియాస్ మొహియుద్దీన్, మజర్ మొహియుద్దీన్ సాజిద్, ఫసియుద్దీన్ నవాబ్, జమిలోద్దీన్, సమద్ నవాబ్, ఎండి తాజుద్దీన్, అబ్బాస్ సమీ, ఎస్ఏ మొహసిన్, సదర్ ఖాజీ మంఖబత్ ఖాన్, హాఫిజ్ జియో ఉల్లాహ్ ఖాన్, ఎంఏ ఖాలీద్, జమీల్, జుబేర్ అహ్మద్, వసిముద్దీన్, షోయబ్ లతిఫీ, లయిక్ ఖాద్రి, నిహల్, అహ్మద్ అలీ, ఖాజాఖాన్, ఎంఏ మతిన్, చాన్, జాఫర్, సాధక్ అలీ తదితరులు పాల్గొన్నారు.


Similar News