CM Revanth : గ్యారంటీలపై మహారాష్ట్ర ప్రజలకు నిజం తెలియాలి.. ముంబయిలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
తెలంగాణలో ఇచ్చిన హామీల అమలుపై మహారాష్ట్రలో బీజేపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఇచ్చిన హామీల అమలుపై (Maharashtra) మహారాష్ట్రలో బీజేపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ముంబయి కాంగ్రెస్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తెలంగాణ గురించి, తమ ఆరు గ్యారెంటీల గురించి అబద్ధాలు బెబుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ మాపై దుష్ప్రాచారం చేయడం ఆపకపోవడం వల్ల నేను నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చానని చెప్పారు. తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ సెప్టెంబర్ 17, 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ గ్యారెంటీలను ప్రణాళిక బద్దంగా ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాలను మహారాష్ట్ర ప్రజల ముందు పెట్టడం తన బాధ్యత అని అన్నారు.
దేశంలో ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలో జరుగుతున్నాయని ఆరోపించారు. దీని తర్వాత (Telangana) తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉండేదని చెప్పారు. గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం ఎలాంటి పనులు చేపట్టలేదని విమర్శించారు. రైతులకు ఎంఎస్‌పీ ఇవ్వలేదని, రైతుల కోసం మోడీ నల్లచట్టాలను తెచ్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారని అన్నారు.
అందుకే మేము ఆలోచించి తెలంగాణలో ఉన్న రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 25 రోజుల్లో 22 లక్షలకు పైగా రైతులుకు రూ.17,869 కోట్లు రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రతి రైతు డేటాను ఇస్తానని తెలిపారు. ఇటీవల ప్రధాని మోడీ ట్వీట్ చేశారని, రుణమాఫీపై పూర్తి వివరాలు ఇవ్వడంలో ప్రధాని ట్వీట్ డిలీట్ చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గ్యారెంటీ వల్ల సిద్దించిందన్నారు.
బీజేపీ దోస్త్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. బీజేపీ నేతలు, ఎక్‌నాథ్‌శిండే, అజిత్ పవార్ కాని ఎవరు తెలంగాణకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలపై పూర్తి వివరాలు ఇస్తామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కోటి మందికి పైగా మహిళలు ఉపయోగిస్తున్నారు, ఇప్పటి వరకు ఆర్టీసీకి రూ.3541 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. రూ.500 సిలిండర్ దాదాపు 49 లక్షల కుటుంబాలు వినియోగించుకుంటున్నాయని తెలిపారు. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ దాదాపు 50 లక్షల కుటుంబాలు వినియోగిస్తున్నారని అన్నారు. రైతుల కోసం వడ్ల కొనుగోలులో ఎంఎస్‌పీ, రూ. 500 బోనస్ ఇస్తున్నామని అన్నారు.