లులు మాల్‌కు పొటెత్తిన జనం (వీడియో)
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్టీయూ దగ్గర ఇటీవల లులు మాల్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఆదరణ ఉన్న లులు మాల్ నగరంలో మొదటిది ఏర్పాటు చేయడంతో ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్టీయూ దగ్గర ఇటీవల లులు మాల్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఆదరణ ఉన్న లులు మాల్ నగరంలో మొదటిది ఏర్పాటు చేయడంతో ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అందులోనూ వీకెండ్ హాలీడేస్ ఉండడంతో పెద్ద ఎత్తున ప్రజలు సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో కూకట్ పల్లి ప్రాంతమంతా భారీ ట్రాఫిక్ అవుతున్నది. ఇవాళ కూడా గాంధీ జయంతి హాలిడే కావడంతో ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు వీడియోలు తీసీ ట్రాఫిక్ పోలీసులు, మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ట్రాఫిక్ సమస్యకు దారి చూపాలని కోరుతున్నారు. కాగా, లులు మాల్ ట్రాఫిక్ పై తాజాగా సోషల్‌మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. మాల్‌కుపోయి కొనే వాళ్లు తక్కువ.. ఊరికే చూసి వచ్చే వాలే ఎక్కువ అంటూ నెటిజన్లు పెద్ద చర్చనే జరుపుతున్నారు. మాల్ ఎంట్రన్స్‌కు కరెక్ట్ రోడ్డు కనెక్టివిటి లేకుండా ఎలా మాల్‌కు పరిమిషన్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.