పెండింగ్ ఫీజు, స్కాలర్షిప్‌లను వెంటనే విడుదల చేయాలి: విద్యార్థి జన సమితి డిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదలు చేయాలని విద్యార్థి జన సమితి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

Update: 2022-12-14 13:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదలు చేయాలని విద్యార్థి జన సమితి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకి వినతి పత్రం అందజేశారు. అనంతరం విద్యార్థి జన సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసంపల్లి ఆరున్ కుమార్‌లు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్ షిప్ బకాయిలు దాదాపు రూ.3300 కోట్ల నిధులు విడుదల చేయక పోవడం వలన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంటర్, డిగ్రీ, పీజీ ప్రొఫెషనల్ కళాశాలల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ఫీజు బకాయిల మీద ఆధారపడి చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనారిటీ విద్యార్థులను విద్యకు దూరం చేసే దురుద్దేశంతో సీఎం పాలన చేస్తున్నారని మండిపడ్డారు.

పెండింగ్లో ఫీజులు చెల్లించకపోవడంతో, వివిధ కోర్సులను పూర్తి చేసినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వెల్లడించారు. కావున పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా చేసే పోరాటoలో విద్యార్థులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నకరికంటి నరేందర్, జనరల్ సెక్రెటరీ డప్పు గోపి, ప్రశాంత్, సమయ్య, అస్లాం తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News