PDSU: విద్యారంగ సమస్యలపై చలో అసెంబ్లీ .. పిలుపునిచ్చిన పీడీఎస్‌యూ
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్‌యూ(PDSU) విద్యార్థి చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది.
దిశ, వెబ్ డెస్క్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్‌యూ(PDSU) విద్యార్థి చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. తెలంగాణ లో అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పీడీఎస్‌యూ రాష్ట్ర సమితి(PDSU State Samiti) అసెంబ్లీ ముట్టడి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను, విద్యార్థుల ఆత్మహత్యలు నివారించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది. అంతేగాక ఇంటర్ విద్యలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని, అద్దె భవనాల సమస్యలు తీరేలా కొత్త భవనాలు నిర్మించాలి సహా పలు డిమాండ్లను తీసుకొచ్చింది. కార్పొరేట్ కళాశాలల ఆగడాలని అరికట్టాలని, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలిని.. ఇవాళ అసెంబ్లీ ఎదుట నిరసనలు చేయాలని పీడీఎస్ యూ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోని విద్యార్థి నాయకులు పలుపునిచ్చారు.