ప్రియాంక గాంధీ పాలమూరు సభపై ఫోకస్.. కో ఆర్డినేటర్ల నియమించిన టీపీసీసీ

రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలుపు దిశగా నడిపించేందుకు ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇటీవలే తొలి విడత విజయభేరి బస్సు యాత్ర

Update: 2023-10-28 12:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలుపు దిశగా నడిపించేందుకు ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇటీవలే తొలి విడత విజయభేరి బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అక్టోబర్ 31న పాలమూరులో నిర్వహించబోయే 'పాలమూరు ప్రజా గర్జన' సభకు ప్రియాంక గాంధీ హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభను సక్సెస్ చేయడంపై పీసీసీ దృష్టి సారించింది. ఈ మీటింగ్ కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కో ఆర్డినేటర్లను నియమించింది.

ఓవర్ ఆల్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్లుగా సంపత్ కుమార్, మల్లు రవి, చిక్కుడు వంశీకృష్ణలను నియమించారు. ఈ మేరకు శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేష్ కుమార్ గౌడ్ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఇక అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్‌గా కె. రవళి రెడ్డి, గద్వాలకు రఘువీర్ రెడ్డి, వనపర్తికి మధుసూధన్ రెడ్డి, నాగర్ కర్నూల్‌కు కిషోర్ రెడ్డి, అచ్చంపేటకు మధుసూధన్ రెడ్డి, కొల్లాపూర్‌కు ఓబెదుల్లా కొత్వాల్, చరణ్ కౌశిక్ యాదవ్‌లను నియమించారు.

Tags:    

Similar News