మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రకటన
తాము మేనిఫెస్టోలో పేర్కొనని హామీలు కూడా అమలు చేస్తున్నామని తెలంగాణ పీసీసీ(Telangana PCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తాము మేనిఫెస్టోలో పేర్కొనని హామీలు కూడా అమలు చేస్తున్నామని తెలంగాణ పీసీసీ(Telangana PCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. సోమవారం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే 50 వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్(BRS).. రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసిందని మండిపడ్డారు. పారిశ్రామిక అభివృద్ధిపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని అన్నారు.
అంతేకాదు.. అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అన్నారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీ కావాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లాకు త్వరలో యంగ్ ఇండియా కాలేజీ రాబోతోందని కీలక ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చర్చలు జరిపారు. ఈ ప్రక్రియ ఇప్పటికే కొలిక్కి వచ్చినట్లు సమాచారం. దసరా రోజున ప్రకటన చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, ప్రకటన రాలేదు. దీపావళికైనా వస్తుందో లేదో చూడాలి.