గంగారెడ్డి హత్య, జీవన్ రెడ్డి ఆవేదన పై స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి(Gangareddy)ని ఈ రోజు ఉదయం దారుణంగా హత్య చేశారు.

Update: 2024-10-22 13:52 GMT

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి(Gangareddy)ని ఈ రోజు ఉదయం దారుణంగా హత్య చేశారు. కాగా ఈ హత్య అనంతరం జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇంతకాలం పార్టీలో అవమానాలు ఎదుర్కొన్ననని, ఇప్పుడు భౌతిక దాడులకు పాల్పడి హత్యలు చేస్తుంటే.. ఎందుకు పార్టీలో ఉండాలని.. ఇకపై నేను కాంగ్రెస్(congress) పార్టీలో ఉండలేనని అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ వ్యవహారంపై టీ పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(PCC chief Mahesh Kumar Goud) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను జీవన్ రెడ్డి (Jeevan Reddy)తో ఫోన్ లో మాట్లాడానని,, ఆయన అనుచరుడు హత్యకు గురికావడంతో మనస్థాపం చెందారన్నారు. అనుచరుడిని కోల్పోయిన బాధ లోనే సొంత పార్టీ..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. అలాగే ఈ హత్య కేసు గురించి తాను పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడానన్నారు. నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. గంగారెడ్డిని హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు చెప్పాను అని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.


Similar News