ప్రారంభమైన పార్లమెంట్ కొత్త భవన పూజా కార్యక్రమాలు.. పాల్గొన్న మోడీ

నేడు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరగనుంది.

Update: 2023-05-28 02:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరగనుంది. అందులో భాగంగా కాసేపటి క్రితం ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్నహానికి మోడీ నివాళులు అర్పించారు. అనంతరం పూజ కార్యక్రమాల్లో మోడీ పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా సాగుతున్న హోమంలో మోడీ పాల్గొన్నారు. అర్చకులు మోడీని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మోడీతో పాటు స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కొత్త పార్లమెంట్ ఆవరణలో భారీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 16 ఎకరాల్లో రూ.1200 కోట్లతో పార్లమెంట్ కొత్త భవనాన్ని నిర్మించారు. నెమలి థీమ్‌తో లోక్ సభ, రాజ్యసభ తామరపువ్వు థీమ్ నిర్మించారు. సనాతన ధర్మం ఉట్టిపడేలా నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. 64,500 చ.మీటర్ల విస్తీర్ణంలో పార్లమెంట్ భవన నిర్మాణాన్ని చేపట్టారు. 150 ఏళ్ల వరకు స్ట్రాంగ్ గా ఉండేలా భవన నిర్మాణం చేపట్టారు. ఈ భవన నిర్మాణంలో మొత్తం 6వేల మంది కార్మికులు పాల్గొన్నారు.

Also Read: ఇది 'నవ భారతదేశం' కోసం.. కొత్త పార్లమెంట్ భవనంపై షారుఖ్ ఖాన్

Tags:    

Similar News