పంచాయతీ సేవలకు బ్రేక్.. అయినా సర్కారు సైలెంట్

తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల సమ్మెతో పల్లెల్లో పరిపాలన నిలిచిపోయింది.

Update: 2023-05-06 02:54 GMT

తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల సమ్మెతో పల్లెల్లో పరిపాలన నిలిచిపోయింది. దీంతో గ్రామాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీల ద్వారా అందించే సేవలు 10 రోజులుగా నిలిచిపోవడంతో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై ప్రభుత్వం నోరు విప్పకపోవడంతో మరికొన్ని రోజుల పాటు సమ్మె కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పకుంటున్నప్పటికీ ఎక్కడా కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. జీపీఎస్​ల సమ్మె కొనసాగితే పల్లె ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జేపీఎస్‌ల సమస్యలను పరిష్కరించి పంచాయతీల్లో సేవలను పునరుద్దరించాలని పలువురు కోరుతున్నారు.

దిశ, కరీంనగర్​ బ్యూరో : తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల సమ్మెతో పల్లెల్లో పరిపాలన నిలిచిపోయింది. దీంతో గ్రామాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీల ద్వారా అందించే సేవలు 10 రోజులుగా నిలిచిపోవడంతో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పంచాయతీ కార్యదర్శులు సమ్మెపై ప్రభుత్వం నోరు విప్పకపోవడంతో మరికొన్ని రోజుల పాటు సమ్మె కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పకుంటున్నప్పటికీ ఎక్కడా కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. జీపీఎస్​ల సమ్మె కొనసాగితే పల్లె ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

నిలిచిన సేవలు...

పంచాయతీ కార్యదర్శుల సమ్మెతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పౌరసేవలు నిలిచిపోయాయి. తమ డిమాండ్ల సాధన కోసం గత నెల 28నుంచి సమ్మె చేస్తున్నారు. పౌర సేవలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమ్మెతో గ్రామాల్లో జనన, మరణ ధృవీవకరణ పత్రాల జారీ, వివాహ ధృవీకరణ, ఇంటి వ్యాల్యూయేషన్​, నూతన ఇంటి నిర్మాణ అనుమతులు, ఆస్తి మార్పిడి, ట్రేడ్​ లెసెన్స్​ల జారీ వంటి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే ప్రతి నెల నిర్వహించే పంచాయతీ సర్వసభ్య సమావేశం, రెండు నెలలకు ఒక్కసారి గ్రామసభ నిర్వహణ, గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ వంటి కార్యక్రమాలకు సైతం బ్రేక్​ పండింది. గతంలో గ్రామ పంచాయతీల్లో చేసిన తీర్మాణాల ప్రకారం చేసిన పనులకు బిల్లుల చెల్లింపు కొత్త పనుల కోసం తీర్మాణాల వంటి కార్యక్రమాలు నిలిచిపోయాయి.

ప్రజల ఇబ్బందులు...

గ్రామ పంచాయతీల్లో పౌర సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ, ఇంటి నిర్మానాలకు అనుమతులు, వివాహా ధృవీకరణ పత్రాల మంజూరు కాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నయంగా ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నప్పటికీ వారి సేవలు ఎక్కడికి సరిపోవడం లేదనేది ప్రజల నుంచి వస్తున్న ఆరోపణ. ఒక్క అధికారికి మూడు నుంచి నాలుగు గ్రామాలు అప్పగించడంతో అనుకున్న విధంగా పనులు జరగడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మె ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.

నోరు విప్పని ప్రభుత్వం..

గ్రామ పంచాయతీ కార్యదర్శలు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం నోరు విప్పడం లేదు. ప్రభుత్వం తరుపున మంత్రులు లేదా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఒక్కరూ మాట్లాడకపోవడం గమనార్హం. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పంచాయతీ కార్యదర్శల దీక్షలను సంఘీభావం తెలిపినప్పటికీ స్థానికంగా ఉన్న బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు కనీసం సంఘీభావం తెలపడం లేదు. ఇన్ని రోజులు తమ సేవలు చేయించుకున్న బీఆర్​ఎస్​ ప్రతినిధులు కనీసం సంఘీభావం ప్రకటించక పోవడంపై పంచాయతీ కార్యదర్శలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని సమ్మె విరమింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఎండలో ఎండుతూ.. వానలో తడుస్తూ..

తమ డిమాండ్ల సాధన కోసం రాష్ర్ట వ్యాప్తంగా జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు గత నెల 28నుంచి సమ్మె బాట పట్టారు. పంచాయతీ కార్యదర్శులు రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. కాగా, అందుకు పోలీసుల అనుమతి తీసుకొని శాంతియుతంగా దీక్షలు చేస్తున్నారు. కరీంనగర్​ జిల్లా కేంద్రంలో దీక్ష కోసం పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తు చేసుకోగా కరీంనగర్​ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మీసేవా ద్వారా దరఖాస్తు చేసినా అనుమతి ఇవ్వకపోవడంతో కలెక్టరేట్​ ఎదుట టెంట్​ లేకుండానే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తమ శాంతియుత నిరసన తెలుపుతున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మహిళలు పిల్లలను తీసుకొని వస్తారని, ఎండకు తీవ్ర ఇబ్బందులు పడుతామని పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో కలెకర్టేట్​ గేటు వద్ద అలాగే తమ నిరసన కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News