అయోధ్య రామమందిరంపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేళ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-01-02 05:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేళ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ భవాని నగర్‌లో ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని కేంద్రంలోని బీజేపీ యాక్టివిటీస్‌పై ఫోకస్ పెంచాలన్నారు. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. బాబ్రీ మసీదును ఉద్దేశించి మాట్లాడుతూ.. 500 ఏళ్లుగా ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదన్నారు. అక్కడ మనం మజీద్‌ను కోల్పోయాం.. ఇప్పుడేం జరుగుతుందో చూస్తున్నాం.

మీ గుండెల్లో బాధ లేదా..? అని యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. అందరం చనిపోతాం.. కానీ చనిపోయిన తర్వాత అల్లాకు ఏ విధంగా మీ ముఖం చూపిస్తారని యువతను ప్రశ్నించారు. దేశంలో మరో మూడు నాలుగు మసీదులకు సంబంధించి ఇలాంటి కుట్ర జరుగుతుందన్నారు. ఢిల్లీలోని సనేరి మసీద్ (గోల్డెన్ మసీద్) కూడా ఈ జాబితాలో ఉందన్నారు. ఏళ్లుగా కష్టపడి మనం ఈ స్థానాన్ని సంపాదించుకన్నాం. మీరు జరుగుతున్న విషయాలపై శ్రద్ధ వహించండి అంటూ పిలుపునిచ్చారు. అయితే యూపీలోని అయోధ్యలో ఈనెల 22న రామమందిర ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే.


Full View


Tags:    

Similar News