Aditi Rao Hydari: మా పెళ్లి జరిగేది అక్కడే.. అదితి- సిద్దార్థ్ల పెళ్లి వేదిక, తేదీపై నటి క్లారిటీ
హీరో సిద్దార్ధ్ తో ప్రేమలో ఉన్న నటి అదితీ రావు హైదరీ ఎట్టకేలకు పెళ్లి గురించి స్పందించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హీరో సిద్దార్ధ్ తో ప్రేమలో ఉన్న నటి అదితీ రావు హైదరీ ఎట్టకేలకు పెళ్లి గురించి స్పందించారు. తనకు నిశ్చితార్థం జరిగిన వనపర్తి జిల్లాలోని పురాతన దేవాలయంలోనే పెళ్లి కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటుడు సిద్ధార్థ్ తో ప్రేమ వ్యవహారం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సిద్దార్థ్ తనకు హైదరాబాద్ లోని తన నానమ్మకు చెందిన ఓ స్కూల్ లో ప్రపోజ్ చేశాడని, తన నానమ్మ ఆశీస్సుల కోసమే ఇలా చేసినట్టు చెప్పడం తనకెంతో నచ్చి ఓకే చెప్పానని చెప్పింది. అలాగే పెళ్లి వేదిక పై క్లారిటీ ఇస్తూ.. తన ఎంగేజ్ మెంట్ జరిగిన వనపర్తి జిల్లాలోని రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయం తనకెంతో ప్రత్యేకమైనదని, అక్కడే తమ పెళ్లి కూడా ఉంటుందని స్పష్టం చేశింది. అలాగే పెళ్లి తేదీని పెద్దలు నిర్ణయిస్తారని, ఆ తేదీని తాను సిద్దార్థ్ ఇద్దరం కలిసి అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చింది.
కాగా బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్ధ్, హీరోయిన్ అదితీరావు హైదరీతో ప్రేమలో ఉన్నారు. మహాసముద్రం సినిమాలో కలిసి నటించిన వీరికి స్నేహం కుదిరి, అది కాస్తా ప్రేమగా మారింది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఈ ఏడాది మార్చిలో వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో సిక్రెట్ గా ఎంగేజ్ మెంట్ కూడా జరుపుకున్నారు. దీనిపై తెగ ప్రచారం జరిగినా.. ఎంగేజ్ మెంట్ ఫోటోలు బయటకి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయాన్ని చాలా రోజులు గడిచిన తర్వాత సిద్దార్థ్ మీడియా ముఖంగా ప్రకటించారు. ఎంగేజ్మెంట్ పెద్దల సమక్షంలో జరిగిందని, పెళ్లి కూడా పెద్దలు నిర్ణయం ప్రకారమే జరుగుతుందని తెలిపాడు.