'బీఆర్ఎస్‌ను ఓడించడమే మా టార్గెట్'

కమ్మూనిస్టు పార్టీలు ఇండియా కూటమితో బాగస్వామ్యులై బీజేపీపై పోరాటం

Update: 2023-08-22 17:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కమ్మూనిస్టు పార్టీలు ఇండియా కూటమితో బాగస్వామ్యులై బీజేపీపై పోరాటం చేసేందుకు ఏకమైతే ఆ కూటమితో విభేదించడాన్ని బట్టి బీఆర్ఎస్, బీజేపీ లు దోస్తులే అని స్పష్టమవుతుందని ఇక తమ లక్ష్యం'బీఆర్ఎస్‌ను ఓడించడమే మా టార్గెట్' బీఆర్‌ఎస్ పార్టీని ఓడించడమే నని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తేల్చి చెప్పారు. మంగళవారం ముగ్ధుమ్ భవన్‌లో భారాసతో పొత్తు చెడిపోతే వ్యక్తిగతంగా దూషించబోమని, విధాన పరంగా వ్యతిరేకిస్తామని సీపీఐ, సీపీఎం నేతలు ప్రకటించారు. మగ్దూం భవన్‌లో సీపీఐ, సీపీఎం నేతలు సమావేశమై.. భవిష్యత్‌ కార్యాచరణ, ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఇరు పార్టీలకు చెందిన నేతలు చర్చించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.. బీజేపీతో బీఆర్‌ఎస్‌కు ఎక్కడో మిత్రత్వం జరిగింది. బీజేపీకి దగ్గరైతే.. కేసీఆర్‌ మిత్ర ధర్మం పాటించరా? అని అయన ప్రశ్నించారు. భాజపాతో భారాసకు సఖ్యత ఏర్పడిందని అన్నారు. ఇప్పుడు భాజపా ప్రమాదం కాదా? అనే విషయం కేసీఆర్ చెప్పాలని అయన డిమాండ్ చేశారు. మిత్ర ధర్మం పాటించరా? ఇందుకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. రాజకీయం అంటేనే మోసం అనే నిర్వచనాన్ని కేసీఆర్ ఇస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పార్టీతో పోరాటం చేస్తామని భావించి తాము ఇన్నాళ్లు బీఆర్‌ఎస్‌తో జతకట్టామని, కానీ కేసీఆర్ అవకాశవాద రాజకీయ నాయకుడాన్నే విషయం బట్టబయలైందని అయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేస్తుందని తాము ఎవరితో కలవాలనేది భవిష్యత్తులో నిర్ణయిస్తామన్నారు. తమతో కలిసి వచ్చేవారితో పని చేస్తామని స్పష్టం చేశారు. కమ్యూనిస్ట్‌లు అంటే ఏమిటో అందరికీ తెలియజేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కమ్మూనిస్టు లు నిర్ణయాత్మక పాత్ర పోషించడంతో పాటు నూతనంగా ఏర్పడే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పోషిస్తామని అన్నారు. లెఫ్ట్‌ లేకపోతే మునుగోడులో బీఆర్‌ఎస్‌ గెలిచేదా..? మునుగోడులో బీజేపీ గెలిస్తే ఇవాళ ఇంతటి ప్రశాంత వాతావరణ ఉండేదా?. ఎంతటి బేరసారాలు జరిగాయో కేసీఆర్‌ మర్చిపోయారా? కేసీఆర్‌కు బీజేపీ అండదండలు ఉంటే చాలు అనుకుంటున్నారా? అని కూనంనేని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో తమకు నష్టం లేదని.. నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీయేనని సీపీఎం నేత తమ్మినేని వీరబద్రం అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కూడా వామపక్షాలు మిత్రపక్షాలని కేసీఆర్‌ చెప్పారు. కేసీఆర్‌ ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ నిర్ణయం మేం ఊహించని పరిణామమన్నారు.. కేసీఆర్ ఏకపక్షంగా అభ్యర్థుల జాబితా ఇచ్చారని తెలిపారు. మేం అడిగిన సీట్లలో కూడా అభ్యర్థులను ప్రకటించారని చెప్పారు. తాము ఊహించని పరిణామమన్నారు.. మునుగోడులో ఆయనే మద్దతు అడిగారు. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పని చేస్తామని చెప్పారని తమ్మినేని తెలిపారు.

మాకు.. కేసీఆర్‌కి మధ్య సీట్ల పంచాయతీ సమస్య కాదు.. కేసీఆర్‌కి రాజకీయ విధానంతో సమస్య వచ్చింది.. రాజకీయ విభేదం ఏంటో కేసీఆర్ వివరణ ఇవ్వాలన్నారు. మా ఇంటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమో.. వాళ్ల ఇల్లు మాకు అంతే దూరమన్నారు. వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలు కలిసి పని చేస్తాయని అన్నారు. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి.. మా నినాదం బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే అని కమ్యూనిస్టులు అన్నారు. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు’’ అని ఇరు పార్టీల నేతలు వెల్లడించారు. తాము ఎమ్మెల్యే స్థానాలు అడిగితే ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కేసీఆర్ చెప్పారని దీనికి ఆమె విభేదించామని చెప్పారు. తాము ప్రజల్లో వుంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే పంథా తమదన్నారు. గన్ మెన్లు, హోదా కోసం కాదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగాల్సి ఉందని.. ఈ నెల 27 తర్వాత వామపక్ష పార్టీలు మరోసారి ఉమ్మడిగా భేటీ అవుతామని, ఆ తర్వాతే కార్యచరణ ప్రకటిస్తామని వామపక్ష నేతలు వెల్లడించారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, జాన్ వెస్లీ, చెరుపల్లి సీతారాములుతో పాటు సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, తక్కలపల్లి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.


Similar News