ప్రభుత్వ దవాఖానాలో పనిచేస్తున్న టీచింగ్ ఫాకల్టీ బదిలీలకు ఉత్తర్వులు జారీ..

ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేస్తున్న టీచింగ్ ఫాకల్టీ బదిలీలకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2023-05-02 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేస్తున్న టీచింగ్ ఫాకల్టీ బదిలీలకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న కాలేజీలో 2 సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసుకున్న వాళ్లు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌‌కు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫర్ కోసం డీఎంఈ ఆఫీసులో అప్లికేషన్ ఇవ్వాలని సూచించారు. ఈ ట్రాన్స్‌ఫర్ల ద్వారా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల్లోని ఖాళీ పోస్టులు అన్నింటినీ భర్తీ చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ 17 కాలేజీల్లోని ఖాళీల కంటే ఎక్కువ మంది ట్రాన్స్‌ఫర్ల కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆదిలాబాద్ రిమ్స్, సూర్యపేట్, నల్గొండ, మహబూబ్‌నగర్‌‌, సిద్ధిపేట కాలేజీల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. గాంధీ, ఉస్మానియా, కాకతీయ, నిజామాబాద్‌ కాలేజీలకు ఎవరినీ బదిలీ చేయబోమని స్పష్టం చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్‌ఫర్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే, పోస్టింగ్ ఎక్కడికి కావాలో ఆప్షన్ ఇవ్వాలని సూచించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..