Fake Alert: దిశ పేరుతో మరోసారి ఫేక్ క్లిప్పింగ్స్.. క్రియేటర్స్‌‌కు దిశ యాజమాన్యం హెచ్చరిక

‘దిశ పత్రిక’ బ్రాండ్ తో కొంత మంది స్వార్థపరులు మరోసారి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఆ క్లిప్పింగులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Update: 2024-05-31 07:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ‘దిశ పత్రిక’ బ్రాండ్ తో కొంత మంది స్వార్థపరులు మరోసారి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఆ క్లిప్పింగులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దిశకు ఉన్న ప్రజాదరణ, ప్రచురించే వార్తలకు ఉన్న విశ్వసనీయతను అనుకూలంగా మల్చుకోడానికి ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ శక్తులు క్లిప్పింగ్‌ను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నాయని తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబుతో రేవంత్ అర్ధరాత్రి భేటీ అయ్యారని, తెలంగాణ విలీన ప్రతిపాదనపై ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగిందని పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే ఫేక్ వార్తను సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ శక్తులు సర్క్యూలేట్ చేశాయి. తాజాగా ఇదే ఫేక్ వార్తను ప్రచారం చేస్తున్నాయి. ఈ ఫేక్ వార్తపై గతంలో కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కాంగ్రెస్ పార్టీపై, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫేక్ ప్రచారం బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్నాయని గతంలో ఆరోపించింది. ఈ ఫేక్ వార్తపై మరోసారి దిశ యాజమాన్యం స్పందించింది. ఈ ఫేక్ వార్తకు తమకు ఎలాంటి సంబంధం లేదని దిశ ఎడిటర్ మరోసారి స్పష్టం చేశారు. పేపర్ పేరుతో ఫేక్ వార్తలు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వరుసగా ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్న క్రమంలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు యాజమాన్యం తెలిపింది. 

Tags:    

Similar News