Warangal : భద్రకాళి చెరువుకు గండి కొట్టిన అధికారులు

శుక్రవారం ఉదయం భద్రకాళి చెరువు(Bhadrakali pond)లో పూడికతీత పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-08 11:56 GMT

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్ లోని భద్రకాళి చెరువు(Bhadrakali pond)లో శుక్రవారం ఉదయం పూడికతీత పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాగా మత్స్యకారులకు నచ్చజెప్పిన అధికారులు తిరిగి పనులు మొదలు పెట్టారు. వరంగల్(Warangal) పట్టణంలోని భద్రకాళి చెరువు ప్రక్షాళన చేస్తామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. ఇందులో భాగంగా.. చెరువులో పూడికతీత, గుర్రపు డెక్క తొలగింపు పనులు పూర్తి చేయడం కోసం.. మొదట చెరువులో నీటిని పూర్తిగా ఖాళీ చేయవలసి ఉంది. చెరువు కింది భాగంలోని కాలనీల వారిని ముందు జాగ్రత్తగ అప్రమత్తం చేశారు. శుక్రవారం ఉదయం చెరువుకు గండి కొట్టేందుకు అధికారులు చెరువు వద్దకు చేరుకోగా.. మత్స్యకారులు అడ్డుకున్నారు. చెరువులో నీటిని తొలగిస్తే, తాము జీవనాధారం కోల్పోతామని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని.. గండి కొట్టడానికి వీలు లేదని చెరువు వద్ద నిరసనకు దిగారు. దీంతో వెనుదిరిగిన అధికారులు... మధ్యాహ్నం తర్వాత మత్స్యకారులకు నచ్చజెప్పడంతో.. తిరిగి చెరువు పనులు మొదలు పెట్టారు. అందులో భాగంగా చెరువుకు గండి కొట్టించారు. రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున పది, పదిహేను రోజుల్లో నీటిని ఖాళీ చేసి.. చెరువులో పూడికతీత పనులు చేపట్టనున్నారు.

Tags:    

Similar News