Farmer Suicide: పంటను పాడు చేసిన అధికారులు.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

Update: 2024-08-25 07:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారులు పంటను పాడు చేయించారని ఓ రైతు పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కుంటాల మండలం రాయపాడ్ తండాకు చెందిన జ్ఞానేశ్వర్ అనే రైతు మూడెకరాల్లో పత్తి పంటను సాగు చేశాడు. ఇటీవల రుతుపవనాల ప్రభావం కారణంగా వర్షాలు సమయానికి పడటంతో పత్తి చెట్లు బాగా పెరిగాయి. అయితే ఆ పంటను అటవీ అధికారులు గొర్రెలు, మేకలతో మేపించారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేశిన రైతు.. ఇదేమిటని అధికారులను వివరణ కోరగా.. అది అటవీ భూమి అని, అందులో అనుమతి లేకుండా పంట వేయకూడదని, అందుకే ఇలా చేశానట్లు తెలిపారని బాధితుడు వాపోయాడు. పంటకోసం ఇప్పటికే చాలా డబ్బు పెట్టుబడిగా పెట్టానని, ముందస్తు సమాచారం లేకుండా అధికారులే పంటను నాశనం చేయడంతో మనస్తాపానికి గురైన రైతు పంట చేనులోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పంట నాశనం అయిన రైతు వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


Similar News