Occult Worships: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్షుద్రపూజల కలకలం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District)లో క్షుద్రపూజలు(Occult Worships) కలకలం రేపాయి.

Update: 2024-12-01 05:22 GMT

దిశ, వెబ్ డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District)లో క్షుద్రపూజలు(Occult Worships) కలకలం రేపాయి. మహాదేవపూర్ మండలం(Mahadevpur Mandal) కుదురుపల్లి గ్రామం(Kudurupally Village)లోని స్థానిక యువకులు ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ కోసం వెళ్లారు. ఈ యువకులకు వాగులో క్షుద్ర పూజలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో వారు భయాందోళనకు గురై గ్రామస్థులకు సమాచారం అందించారు. కుదురుపల్లి వాగులో మేకపోతును బలిచ్చి, కొబ్బరికాయలు, అన్నం బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో ఈ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను చూసిన జనం ఆందోళన పడుతున్నారు. దీనిపై విచారణ జరిపి నిందితులు ఎవరో గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేగాక ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News