పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర రాజధాని, హైదరాబాద్ మహానగరంగా విలసిల్లుతోంది. ప్రపంచ స్థాయి కట్టడాలతో నూతల టెక్నాలజీతో దూసుకుపోతూ.. ప్రపంచ దేశాలను హైదరాబాద్ రప్పిస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజధాని, హైదరాబాద్ మహానగరంగా విలసిల్లుతోంది. ప్రపంచ స్థాయి కట్టడాలతో నూతల టెక్నాలజీతో దూసుకుపోతూ.. ప్రపంచ దేశాలను హైదరాబాద్ రప్పిస్తుంది. ఐటీకి పెట్టింది పేరుగా ఓ పక్క నగరం అభివృద్ధి చెందుతుంటే.. పాతబస్తీ(Old city)లో మాత్రం దానికి విరుద్ధంగా ఉంది పరిస్థితి. టెక్నాలజీతో ఒ పక్కన నగరం దూసుకుపోతుంటే పాతబస్తీలోని కొంతమంది మాత్రం మంత్రాలు, తంత్రాలు, క్షుద్రపూజలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి పాతబస్తీలో చోటు చేసుకుంది. దైరా మీర్ మోమిన్ స్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. ఓ బొమ్మకు ఐదుగురు ఫోటోలు కట్టి క్షుద్రపూజలు(occult worship) చేసినట్లు స్థానికులు గమనించారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ(MLA Mir Zulfiqar Ali) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇకపై ఇలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే అలీ కోరారు.