272 పోస్టులు.. మార్చి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ

సింగరేణి సంస్థలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. మైనింగ్, ఫైనాన్స్-అకౌంట్స్, పర్సనల్, ఐఈ, హైడ్రో జియాలజిస్టు, సివిల్ తదితర విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులతో పాటు మొత్తం పది రకాల్లోని 272 స్థానాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Update: 2024-02-22 17:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. మైనింగ్, ఫైనాన్స్-అకౌంట్స్, పర్సనల్, ఐఈ, హైడ్రో జియాలజిస్టు, సివిల్ తదితర విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులతో పాటు మొత్తం పది రకాల్లోని 272 స్థానాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని, ఫిజికల్ రూపంలో దరఖాస్తు ప్రాసెస్ ఉండదని సీఎండీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (30 పోస్టులు) మినహా మిగిలిన అన్ని పోస్టులకూ గరిష్ట వయో పరిమితిని 30 సంవత్సరాలుగా సింగరేణి సంస్థ ఫిక్స్ చేసింది. సింగరేణి సంస్థ కుటుంబ సభ్యులకు మాత్రం మాగ్జిమమ్ ఏజ్ లిమిట్ లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఎక్కువగా మైనింగ్ విభాగంలో మేనేజ్‌మెంట్ ట్రైనీకి 139 పోస్టులు, ఫైనాన్స్-అకౌంట్స్ విభాగంలో 22, పర్సనల్ విభాగంలో 22 చొప్పున ఉన్నాయి.

Tags:    

Similar News