కౌశిక్ రెడ్డికి నోటీసుల అంశంలో ట్విస్ట్.. ఆమె ఫిర్యాదుతోనే NCW యాక్షన్..!
గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయంలో ఇందిరా శోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయంలో ఇందిరా శోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఎన్సీడబ్ల్యూ ఈ కేసును సుమోటోగా స్వీకరించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఇందిరా శోభన్ ఖండించారు.
ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోలేదని.. తన ఫిర్యాదుతోనే చర్యలకు మహిళా కమిషన్ ఉపక్రమించిందని సోమవారం ట్వీట్ చేశారు. ఈ మేరకు తన చేసిన ఫిర్యాదుకు సంబంధించిన స్క్రీన్ షార్ట్‌ను ఇందిరా శోభన్ ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా కౌశిక్ రెడ్డిని రేపు ఉదయం 11:30 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది.