నో రికమెండేషన్స్.. మెరిట్ ఆధారంగానే పోస్టింగ్స్ : సైబరాబాద్ పరిధిలో అవినాష్ మహంతి ప్రక్షాళన మొదలు

గత ప్రభుత్వంలో పోలీసు శాఖలో ఎమ్మెల్యేల సిఫారసులతో పోస్టింగ్స్ నడిచేవి.

Update: 2024-01-07 07:47 GMT

దిశ, రాచకొండ : గత ప్రభుత్వంలో పోలీసు శాఖలో ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసులతో కావాల్సిస చోటల్లా పోస్టింగ్స్ ఇచ్చేవారు. అయితే, ఇటీవలే అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఆ ఆనవాయితీ స్వస్తి చెప్పనుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో రేవంత్ సర్కార్ సరికొత్త పంథాలో దూసుకెళ్తోంది. రూల్స్‌ను గౌరవించి చట్ట పరిధిలో ప్రజలకు సేవలందించేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ నుంచే ప్రక్షాళనను ప్రారంభించింది. ఇప్పటి వరకు హైదరాబాద్ సీపీ అవినాష్ మొహంతి దాదాపు 20 మందికి పైగా పోస్టింగ్స్‌ను కేవలం ట్రాక్ అండ్ మెరిట్స్ ఆధారంగా చేసుకునే ఇచ్చారు. అయితే, ఈ తరహా విధానం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల్లో నూతన ఉత్సాహం నింపుతోంది. ఎవరి అండదండలు లేని వారు, ఉద్యోగాన్ని దైవంగా భావించే ఆఫీసర్లు ప్రస్తుతం మెరిట్ ఆధారంగా పోస్టింగ్స్ దక్కుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News